సత్తా చాటిన విద్యార్థినులు
ప్రజాశక్తి-నర్సీపట్నం రూరల్:ఈ నెల 12న ఆంధ్రా యూనివర్సిటీలో నిర్వహించిన ఏయు అంతర్ యూనివర్సిటీ వూష సెలక్షన్స్ టోర్నమెంట్‌లో నర్సీపట్నం డిగ్రీ కళాశాలలో చదువుతున్న ముగ్గురు ఉమెన్ బాక్సర్లు పతకాలు సాధించారు. వీరిలో లాలం ప్రవల్లిక(60 కేజీల విశాగం)లో గోల్డ్ మెడల్ సాధించారు. వేపాడ ప్రియాంక(65 కేజీల విభాగంలో) గోల్డ్ మెడల్, జి.జ్ఞానావతి(48 కేజీల విభాగంలో) సిల్వర్ మెడల్ సాధించారు. వీరిని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్.రాజు, పిడి సురేష్ బాబు, శాప్ కోచ్ అబ్బు, బాక్సింగ్ ద్రోణాచార్య అవార్డు గ్రహీత ఐ. వెంకటేశ్వరరావు, వూష అసోసియేషన్ కోచ్ రమ్య, నేషనల్ వూష రిఫరీ వెంకట్, నింజాస్ అకాడమీ డైరెక్టర్లు, తల్లిదండ్రులు అభినందించారు.










