May 06,2023 00:32

పతకాలు స్వీకరిస్తున్న క్రీడాకారులు

ప్రజాశక్తి -నర్సీపట్నం టౌన్‌ :తిరుపతిలో మే 1 నుండి 5వ తేదీ వరకు జరిగిన సీనియర్‌ రాష్ట్ర స్థాయి సీఎం కప్‌ బాక్సింగ్‌ టోర్నమెంట్‌లో నర్సీపట్నం క్రీడాకారులు రెండు స్వర్ణ పతకాలు సాధించారని శాప్‌ కోచ్‌ ఆబ్బు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నర్సీపట్నం నుండి ముగ్గురు సీనియర్‌ ఉమెన్‌ బాక్సర్లు కోలుకుల కృష్ణవేణి (60కేజీ), జిబొంతు మౌనిక (80కేజీ) ల విభాగంలో ఫైనల్‌లో గోల్డ్‌ మెడల్‌ సాధిం చారన్నారు. వీరిని శాప్‌ అధికారులు, ద్రోణాచార్య అవార్డు గ్రహీత వెంకటేశ్వరరావు అభినందించి బంగారు పతకాలను అందజేశారు.