ప్రజాశక్తి-నర్సీపట్నంరూరల్:ఈ నెల 9న ఆంధ్రా యూనివర్శిటీలో నిర్వహించిన బాక్సింగ్ పోటీల్లో నర్సీపట్నం డిగ్రీ కళాశాలలో చదువుతున్న ఐదుగురు మహిళా బాక్సర్లు పతకాలు సాధించారు. 66 కేజీల విభాగంలో లాలం ప్రవల్లికకు రజత పతకం, 57 కేజీల విభాగంలో కొలుకుల కృష్ణవేణికి సిల్వర్, బెస్ట్ లూసర్ అవార్డు వచ్చింది. 75 కేజీల విభాగంలో వేపాడ ప్రియాంక, 46 కేజీల విభాగంలో కుపరాల శాంతికుమారి, 54 కేజీల విభాగంలో పెద్దపాతిని రజని కాంస్య పతకాలు సాధించారని ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్. రాజు, శాప్ కోచ్ అబ్బు తెలిపారు. వీరికి బాక్సింగ్ ద్రోణాచార్య అవార్డు గ్రహీత ఐ.వెంకటేశ్వరరావు, డిగ్రీ కళాశాల పిడి ఎస్.సురేష్‌బాబు, బుల్లయ్య కళాశాల ఫిజికల్ డైరెక్టర్ శ్రీనివాసరావు మెడల్స్ వేసి అభినందించారు. ఈ సందర్భంగా నింజాస్ అకాడమీ డైరెక్టర్లు, తల్లిదండ్రులు, తోటి బాక్సర్లు వీరిని అభినందించారు.










