Aug 07,2022 23:25

సూర్యనారాయణ, జైరామ్‌ను సన్మానిస్తున్న అసోసియేషన్‌ సభ్యులు

ప్రజాశక్తి-మాధవధార : బాక్సింగ్‌ క్రీడకు ఎంతో ప్రాధాన్యత ఉందని ఆంధ్రప్రదేశ్‌ వెయిట్‌ లిఫ్టింగ్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు కంచరాన సూర్యనారాయణ, అర్జున్‌ అవార్డు గ్రహీత జైరామ్‌ అన్నారు. స్టార్‌ బాక్సింగ్‌ అసోసియేషన్‌, భయ్యా బాక్సింగ్‌ అసోసియేషన్‌ సంయుక్తంగా ఏషియన్‌ బాక్సింగ్‌ షిప్‌కు భారతదేశం తరపున మేనేజర్‌గా వ్యవహరించిన కంచరాన సూర్యనారాయణ, అర్జున్‌ అవార్డు గ్రహీత జైరామ్‌ను మురళీనగర్‌లో ఆదివారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, తల్లిదండ్రులు చిన్ననాటి నుంచి పిల్లలకు క్రీడలపై ఆసక్తి పెంపొందించాలని సూచించారు. బాక్సింగ్‌ క్రీడ మహిళల ఆత్మరక్షణకు ఉపయోగపడుతుందని చెప్పారు. నేటి యువత బాక్సింగ్‌ క్రీడను నేర్చుకొని జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు పొందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పప్పల వరాహా నరసింహం, బాక్సింగ్‌ కోచ్‌ చౌద, పప్పల గౌరీశంకరరావు, ధనుంజరు, తిరుమలరావు, బాగాది చంటి, పప్పల గోపాల్‌, తదితరులు పాల్గొన్నారు.