పజాశక్తి -నర్సీపట్నం టౌన్:రాష్ట్ర స్థాయి ఉషు ఖేలో ఇండియా పోటీలలో నర్సీపట్నం నుంచి నలుగురు బాక్సింగ్ క్రీడాకారులు ప్రతిభ చాటడంతో మున్సిపల్ వైస్ చైర్మన్ కోనేటి రామకృష్ణ అభినందించారు. ఈ నెల 29, 30 తేదీలలో గుంటూరులో జరిగిన వూషు పోటీలలో పాల్గొన్న క్రీడాకారులు గోల్డ్ మెడల్స్ సాధించారు. సీనియర్ లో వేపాడ ప్రియాంక, 70కేజీ ల జూనియర్ లో బి.రాజరాజేశ్వరి, 52కేజీ సబ్ జూనియర్ కేటగిరీలో కురచా శరణ్య శశిప్రియ, కురచా శర్వాణి బంగారు పతకాలు సాధించారు. మున్సిపల్ వైస్ చైర్మన్ కోనేటి రామ కృష్ణ, గొల్లవెల్లి రాము, వైసిపి టౌన్ ప్రచార కమిటీ కన్వీనర్ కోనేటి రామకృష్ణలు మాట్లాడుతూ, జాతీయ స్థాయిలో మెడల్స్ సాధించడంపై ఆనందం వ్యక్తం చేశారు. డైరెక్టర్స్ బోలెం శివ, కోచ్ ఎర్ర శేఖర్, క్రీడాకారులను అభినందించారు. వీరంతా సౌత్ జోన్ నేషనల్ పోటీలకు వెళతున్నారని కోచ్ శేఖర్ తెలిపారు.










