అభినందిస్తున్న ఎమ్మెల్యే గణేష్
ప్రజాశక్తి- నర్సీపట్నం రూరల్:ఈ నెల 12 నుంచి 16 వరకు హర్యానాలోని జరిగే ఫస్ట్ ఖేల్ ఇండియా నేషనల్ బాక్సింగ్ అండర్ 14 విభాగంలో నింజాస్ అకాడమీకి చెందిన ముగ్గురు బాక్సర్లు పాల్గొననున్నారు. వీరిలో ఎం.లాస్య (34 కేజీల విభాగం), జి.జ్యోతి (42 కేజీల విభాగం), కె.హర్షిత (65 కేజీల విభాగం)లో ఆడనున్నారు. ఈ నెల 9న వీరంతా హర్యానా వెళ్లనున్నారు. ఈ మేరకు వీరిని నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్, మున్సిపల్ చైర్ పర్శన్ గుడబండి ఆదిలక్ష్మి అభినందించారు. పతకాలు సాధించి నర్సీపట్నంకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. స్టేట్ స్కూల్ గేమ్స్‌లో రాణించిన బొంతు మౌనికను ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమం లో శాప్ కోచ్ అబ్బు, కోచ్ శేఖర్ పాల్గొన్నారు.










