Jan 06,2023 00:05

కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి నాగార్జున తదితరులు

ప్రజాశక్తి - కశింకోట
విద్యార్థులు బాగా చదివి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మెరుగు నాగార్జున అన్నారు. మండలంలోని తాళ్ళపాలెం అంబేద్కర్‌ బాలికల గురుకుల పాఠశాలను గురువారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి విద్యార్థి చదువుతో పాటు ఆటలు పాటల్లో కూడా రాణించాలన్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చదువు కోసం ఎంతో కృషి చేస్తున్నారన్నారు. ప్రభుత్వం పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ముందుగా అంబేద్కర్‌ విగ్రహం వద్ద పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్‌ అధ్యక్షురాలు కలగా లక్ష్మి, జిల్లా గురుకుల పాఠశాల సమన్వయకర్త రూపావతి, ప్రిన్సిపాల్‌ మళ్ళ మాణిక్యం విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు.