Aug 12,2023 00:17

మాట్లాడుతున్న అడిషినల్‌ సీనియర్‌ సివిల్‌ జడ్జి కె.మధుస్వామి

ప్రజాశక్తి - పల్నాడు జిల్లా : చదువు, భవిష్యత్‌ పట్ల విద్యార్థులు బాధ్యతగా మెలగాలని, అప్పుడే విద్యార్థుల మధ్య స్నేహ సంబంధాలు మెరుగుపడి ర్యాగింగ్‌ అనే ఆలోచన రాదని నరసరా వుపేట అడిషినల్‌ సీనియర్‌ సివిల్‌ జడ్జి కె.మధుస్వామి అన్నారు. ర్యాగింగ్‌, సున్నితమైన వ్యవహార శైలి, స్నేహ పూర్వ సంబంధాల మెరుగు పరచడం తదితర అంశాలపై జెఎన్‌టియు నరసరావుపేట కళాశాలలో ఇంజినీరింగ్‌ ద్వితీయ సంవ త్సర విద్యార్థులకు ఎన్‌ఎస్‌ఎస్‌ యూనిట్‌, నరసరావుపేట మండల లీగల్‌ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన అడిషినల్‌ జడ్జి కె.మధు స్వామి మాట్లాడుతూ చదువుపై శ్రద్ధ లేని విద్యార్థులే ర్యాగింగ్‌కు పాల్పడుతు న్నారనేది గత పరిస్థితులు ద్వారా అర్థమ వుతోందన్నారు. చదువులో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి ప్రత్యేక శ్రద్ధ తీసుకొని అధ్యాపకులు, తల్లిదండ్రులు మార్గనిర్దేశం చేయాలని, తద్వారా సమా జంలో మార్పులు తేవొచ్చని చెప్పారు. కళాశాల వైస్‌ ప్రిన్సిపల్‌ ప్రొఫెసర్‌ కె.శోభన్‌బాబు మాట్లడుతూ తమ కాలేజీలో 2016 నుండి ర్యాగింగ్‌ కేసు నమోదు కాలేదన్నారు. ఇక్కడ విద్యార్థులు ఎంతో క్రమశిక్షణతో ఉంటారన్నారు. కార్యక్రమమంలో మానసిక వ్యక్తిత్వ వికాస వైద్య నిపుణులు డాక్టర్‌ సతీష్‌, సామాజిక కార్యకర్త బి.డేవిడ్‌, కె.ఆర్‌ జూనియర్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ ఎం.గోపాలకృష్ణ, సీనియర్‌ న్యాయవాది కె.విజయ కుమార్‌, సీనియర్‌ ప్రొగ్రామ్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ జి.పి.రాజు పాల్గొన్నారు.