Oct 11,2023 23:20

ప్రజాశక్తి - చీరాల
ఉపాధి హామీ పధకం సిబ్బంది అందరూ బాధ్యతగా విధులు నిర్వహిస్తూ అభివృద్ధికి సహకరించాలని డ్వమా పిడి శంకర్ నాయక్ అన్నారు. స్థానిక ఎంపిడిఒ కార్యాలయంలో ఉపాధి హామీ పధకం సిబ్బందికి జిల్లా శిక్షణ కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. గ్రామస్థాయిలో ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమమంపై అవగాహన కల్పించాలని అన్నారు. పనుల విషయంలో పొందుపరుస్తూ సమస్యలు ఏమైనా ఉంటే వెంటనే పరిష్కరించే దిశగా చర్యలు చేపట్టాలని అన్నారు. అదేవిదంగా 2024-25 సంవత్సరానికి సంబంధించి పనులను గుర్తించాలని అన్నారు. వాటి నిర్వహణపై సాంకేతిక శిక్షణను రిసోర్స్ పర్సన్ ద్వారా అందించాలని అన్నారు. కార్యక్రమంలో ఎపిడిలు రాజేష్, సువార్త, మొక్కల పెంపకం నిర్వాహకురాలు శిరీష, అంబుడ్స్ మెన్ రతయ్య, విజులెన్స్ అధికారి శోభన్ బాబు, అన్ని మండలాలకు చెందిన ఎపిఒలు, సాంకేతిక, ఇంజనీర్ సహాయకులు పాల్గొన్నారు.