Mar 07,2023 19:31

పకీరయ్యను సన్మానిస్తున్న ఆర్టీసీ ఎంప్లాయిస్‌ యూనియన్‌ నాయకులు

బాధ్యతతో పని చేస్తే అందరి మన్ననలు పొందవచ్చు
ఆర్‌టిసి డోన్‌ డిపో ఎస్‌టిఐ జె.పకీరయ్య


ప్రజాశక్తి - డోన్‌

బాధ్యతతో పనిచేస్తే అందరి మన్నన్నలు పొందవచ్చని ఆర్‌టిసి డోన్‌ డిపో ఎస్‌టిఐ జె.పకీరయ్య పేర్కొన్నారు. మంగళవారం డోన్‌ డిపోలో పనిచేస్తున్న ఎస్‌టిఐ జె. పకీరయ్య రిలీవింగ్‌పై రాయదుర్గం స్క్వాడ్‌ ఇన్చార్జిగా రిలీవ్‌ అవుతున్న సందర్భంగా ఎంప్లాయిస్‌ యూనియన్‌ డోన్‌ డిపో సెక్రెటరీ ఐవిఆర్‌.రెడ్డి ఆధ్వర్యంలో పూలమాలతో శాలువలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎంప్లాయిస్‌ యూనియన్‌ డోన్‌ డిపో సెక్రెటరీ ఐవిఆర్‌ రెడ్డి మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికుల పట్ల ఎంతో ప్రేమానురాగాలు చూపడం అభినందనీయం అన్నారు. ఆర్టీసీ కార్మికులతో మమేకమై ప్రతి పనిని బాధ్యతగా పనిచేయడం అభినందనీయమన్నారు. ప్రతి కార్మికునికి అండగా నిలబడి వారి బాగోగులు చూడడం ఎంతో గొప్ప విషయం అన్నారు. కార్యక్రమంలో ఎంప్లాయిస్‌ యూనియన్‌ నాయకులు రమణారెడ్డి,చాంద్‌ బాషా,ఎంఎస్‌. నారాయణ, ఏఎస్‌.కుమార్‌, పి.దాస్‌, నాగేంద్ర, ఓకే రెడ్డి, టిఐ 3 ఎస్‌ఎం జిలాని, ఎడిసిలు డి.చంద్రుడు, రంగస్వామి,బిఎస్‌ఎస్‌ వి రాజు తదితరులు పాల్గొన్నారు.