Jun 05,2023 20:37

సుకుమార్‌ను అభినందిస్తున్న మధుసూదనరావు, న్యాయవాదులు

ప్రజాశక్తి-గుంటూరు లీగల్‌ : నెల్లూరు జిల్లా, గూడూరు కోర్టులో సీనియర్‌ అసిస్టెంట్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌గా పనిచేస్తూ, గుంటూరు నాల్గవ అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టుకు బదిలీ అయిన ఎస్‌ఎస్‌ఎస్‌ సుకుమార్‌ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా డిప్యూటీ డైరెక్టర్‌ ఆఫ్‌ ప్రాసిక్యూషన్స్‌ పాతూరి మధుసూదనరావు, స్పెష‌ల్ మొబైల్ కోర్టు ఏపిపి శౌరి, జిబిఎ మాజీ ఉపాధ్య‌క్షులు ఉప్పులూరి శ‌ర‌త్‌, న్యాయ‌వాదులు సురేష్‌, కోట‌య్య‌, కిషోర్‌బాబు త‌దిత‌రులు సుకుమార్‌కు శాలువా క‌ప్పి స‌త్క‌రించారు.