Sep 14,2023 00:22

ప్రజశక్తి - చీరాల
ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకు వెళుతున్న వాలంటీర్లు బాధ్యతగావిధులు నిర్వహించాలని వైసీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ కరణం వెంకటేష్ బాబు అన్నారు. పట్టణంలో 11మందికి నూతన వాలంటీర్లకు బుధవారం నియామక పత్రాలు స్థానిక ఆర్ అండ్ బి అతిధి గృహంలో అందజేశారు. కార్యక్రమంలో మునిసిపల్ చైర్మన్ జంజనం శ్రీనివాసరావు, వైస్ చైర్మన్ బొనిగల జైసన్ బాబు, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కొండ్రు బాబ్జీ, షేక్ కబీర్, కౌన్సిలర్‌ గోలి స్వాతి, మల్లెల లలితరాజశేఖర్, కంపా అరుణ్, మించాల సాంబశివరావు, తోకల అనిల్, గోలి జగదీష్, షేక్ సుభానీ, చిలుకోటి శ్రీను, మామిడాల సుబ్బారావు పాల్గొన్నారు.