బాధ్యతగా విధులు నిర్వహించాలి
ప్రజాశక్తి-ఉదయగిరి : ఓటర్ల జాబితా తయారీలో బిఎల్‌ఒలు బాధ్యతగా వ్యవహరించాలని డ్వామా పిడి నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి వెంకట్రావు పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక స్త్రీ శక్తి భవనంలో ఉదయగిరి, సీతారాంపురం మండలాల బిఎల్‌ఒలు సచివాలయ సిబ్బంది విఆర్‌ఒతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతిఒక్కరూ ఎన్నికల కమిషన్ నియమ నిబంధనలకు లోబడి పని చేయాలన్నారు. ఇంటింటికి తిరిగి ఓటర్ల సవరణ చేపట్టాలన్నారు ఒకే పోలింగ్ కేంద్రంలో కుటుంబ సభ్యులంతా ఉండేలా చూడాలన్నారు. వలస మృతి చెందిన ఓటర్ల విషయంలో జాగ్రత్త వహించాలన్నారు. 18 సంవత్సరాలు నిండిన యువత ఓటు హక్కు పొందేలా చర్యలు చేపట్టాలన్నారు. నిర్లక్ష్యం వహించిన వారిపై చర్యలు తప్ప ఉన్నారు. కార్యక్రమంలో తహశీల్దార్లు జగదీష్ బాబు, షాజియా, బిఎల్‌ఒలు, విఆర్‌ఒలు పాల్గొన్నారు.










