బాధిత కుటుంబాన్నిపరామర్శిస్తున్న ప్రదీప్‌రెడ్డి
ప్రజాశక్తి - మంత్రాలయం
రోడ్డు ప్రమాదంలో గాయపడిన బాధితుని వైసిపి రాష్ట్ర యువ నేత వై.ప్రదీప్ రెడ్డి పరామర్శించారు. తెలంగాణ రాష్ట్రం వనపర్తి జిల్లాలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో పెద్దకడబూరు మండలం హానుమాపురం గ్రామానికి చెందిన ఈరన్న గాయపడ్డారు. గాయపడిన ఆయనను వనపర్తి ఏరియా ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం కర్నూలులోని మెడికవర్ ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న ప్రదీప్‌రెడ్డి ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి ఆదేశాల మేరకు కర్నూలులోని ఆస్పత్రికి మంగళవారం వెళ్లి బాధిత కుటుంబాన్ని పరామర్శించి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే పిఎ వెంకట్రామి రెడ్డి, సర్పంచి పూజారి ఈరన్న, వైస్ సర్పంచి రఘు ఉన్నారు.










