Feb 13,2023 23:42

తహశీల్దారుకు వినతిపత్రం ఇస్తున్న టిడిపి నాయకులు

ప్రజాశక్తి-విఆర్‌.పురం
2022 జులై, ఆగస్టు నెలల్లో వచ్చిన గోదావరి వరదల కారణంగా ముంపునకు గురైన ప్రతి వరద బాధితునికీ నష్టపరిహారం చెల్లించాలని తెలుగుదేశం పార్టీ నాయకులు సోమవారం తహశీల్దారు శ్రీధర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంలో జెడ్పిటిసి వాళ్ళ రంగారెడ్డి, మాజీ జెడ్పిటిసి ముత్యాల రామారావు మాట్లాడుతూ విఆర్‌ పురం మండలంలోని వరద బాధితులకు ఇటీవల చెల్లించిన ప్రభుత్వ సహాయంలో అవకతవకాలు జరిగాయని తెలిపారు. మండలంలో సుమారు 8 గ్రామ పంచాయతీలలో గ్రామాలు నీట మునిగి రహదారి లేక అనేక ఇబ్బందులు పడి ఆస్తి నష్టపోవడం జరిగిందని, కాని ప్రభుత్వం నష్టపోయిన కుటుంబాలకు చెల్లించవలసిన వరద సహాయంలో నేటికీ అందకపోవడం దారుణమన్నారు. కొన్ని కుటుంబాల వారి ఇళ్లు పడిపోయిన నష్ట పరిహారం ఇవ్వలేదని, అదే సందర్భంలో కొంతమంది ఇళ్లు పడిపోక పోయినా ఫుల్‌ డేమేజ్‌గా రాసి నష్టపరిహారం ఇచ్చినట్లు పేర్కొన్నారు. సర్వే లిస్టులో వచ్చిన ఇల్లు ఎన్ని సర్వే లిస్టులో రాణి ఇల్లు ఎన్ని విచారణ చేసి, వరదలో మునిగిన ప్రతి ఇంటికీ వరద సహాయం ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో టిడిపి మండల అధ్యక్షులు ఆచంట శ్రీనివాస్‌, కార్యదర్శి బురక కన్నారావు, సిద్దు, బొర్రా నరేష్‌ కుమార్‌, బీరక సూర్య ప్రకాష్‌ రావు, ముత్యాల చంద్రశేఖర్‌, తదితరులు పాల్గొన్నారు.