ప్రజాశక్తి - మంత్రాలయం
ద్విచక్ర వాహనంపై నుంచి కింద పడి చికిత్స పొందుతున్న ఖాజా హుస్సేన్‌ను, అనారోగ్యంతో చికిత్స పొందుతున్న బాలయ్యను వైసిపి యువజన విభాగం రాష్ట్ర నాయకులు వై.ప్రదీప్ రెడ్డి గురువారం పరామర్శించారు. స్థానిక వ్యవసాయ పరపతి సంఘం సిఇఒ ఖాజా హుస్సేన్ ఇటీవల చిలుకలడోన గ్రామ సమీపంలో ఉన్న బారికేడ్లను ద్విచక్ర వాహనంతో ఢకొీని గాయపడ్డారు. కర్నూలు నగరంలోని మెడికవర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఖాజా హుస్సేన్‌ను, అలాగే ఓమ్నీ ఆస్పత్రిలో అనారోగ్యంతో చికిత్స పొందుతున్న బసలదొడ్డి గ్రామానికి చెందిన బాలయ్య ఆరోగ్య విషయాలపై ఆరా తీశారు. విషయం తెలుసుకున్న ఆయన ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి ఆదేశాల మేరకు కర్నూలుకు వెళ్లి చికిత్స పొందుతున్న ఇరువురిని పరామర్శించి అధైర్య పడొద్దని భరోసా ఇచ్చారు. వైసిపి మండల నాయకులు బూదూరు లక్ష్మి నారాయణ రెడ్డి, కాంతా రెడ్డి ఉన్నారు.
బాధితులను పరామర్శిస్తున్న ప్రదీప్‌రెడ్డి










