
ప్రజాశక్తి - పాలకొల్లు
పాలకొల్లు యునైటెడ్ కాపు ఇంటర్ నేషనల్ క్లబ్ సమావేశం బుధవారం దీప్తి స్కూల్ ఆవరణలో జరిగింది. ఇటీవల యాక్సిడెంట్‌లో తీవ్రంగా గాయపడిన కొప్పినీడి బాలాజీకి వైద్యం నిమిత్తం రూ.5000, వరిధనం గ్రామానికి చెందిన మద్దాల పవన్‌రామ్‌కు రూ.10,000 ఆర్థిక సహాయం చేశారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ డాక్టర్ ముచ్చర్ల సంజరు, అధ్యక్షులు గాది ఆంజనేయులు, కార్యదర్శి పశ్యావుల రవికుమార్, కోశాధికారి ఇనుకొండ శేషాద్రి, రావూరి అప్పారావు పాల్గొన్నారు.