బాధితులకు ఎంఎల్‌ఎ రామిరెడ్డి పరామర్శ
ప్రజాశక్తి-కావలి రూరల్ : కావలి మండల పరిధిలోని కొత్తపల్లి గ్రామంలో ఇటీవల గణేష్ నిమజ్జనం సందర్భంగా బాణసంచా పేలి గాయాలైన చిన్నారులను ఎంఎల్‌ఎ దంపతులు రామిరెడ్డి ప్రతాప్‌కుమార్ రెడ్డి, ఆదిలక్ష్మి ఆదివారం పరామర్శించారు. వినాయక నిమజ్జనం సందర్భంగా జరిగిన అపశృతిలో బాణసంచా పేలి గాయాల పాలైన నలుగురు చిన్నారులు మధు వర్షిత, హిమ(11) బిందు(12), జాహ్నవి(13), నీహారిక(11) క్రిష్ణ మోహన్ (25)లను వారి ఇంటికి వెళ్లి పరామర్శించారు. వారి యోగ క్షేమాలను తెలుసుకొని వారందరికీ ధైర్యం చెప్పి వ్యక్తిగతంగా, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ పరంగా మీకు అన్ని విధాలుగా బాధితులను ఆదుకుంటామని హామీనిచ్చారు. ఈ సందర్భంగా ఎంఎల్‌ఎ దంపతులకు కొత్తపల్లి గ్రామ సర్పంచ్ చిమ్మిలి శ్రీహరి నాయుడు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో నాయకులు చిమ్మిలి అంకబాబు, చిమ్మిలి కృష్ణయ్య, యర్రా మల్యాద్రి, విజయబాబు, రామారావు, వెంకయ్య, చెంచునాయుడు, సుబ్బరాయుడు, శేషగిరి, రమణయ్య, వేణు, రామా, శ్రీకాంత్, గంగాదర్, చిన మాలి తదితర నాయకులు పాల్గొన్నారు.










