సరుకులు ఇస్తున్న ఎమ్మెల్యే ఫాల్గుణ
ప్రజాశక్తి-పెదబయలురూరల్:మండలంలోని కుంతుర్ల పంచాయతీ కిండలం గ్రామంలో అరకు ఎమ్మెల్యే ఫాల్గుణ ఆదివారం పర్యటించారు. ఇటీవల కిండలం గ్రామంలో వరుసగా ఏడుగురు ఆదివాసులు వివిధ రోగాలతో సహజ మరణలు మృతి చెందడంపై ఇంటింటా సందర్శించి ఓదార్చారు. ముఢ నమ్మకాల పై దృష్టి పెట్ట వద్దని సూచించారు. మృతుల కుటుంబాలకు రూ.10వేల చొప్పున వ్వక్తిగత ఖాతాలో జమ చేస్తామని చెప్పారు.బాధితులకు నిత్యావసర సరుకుల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్‌ఆర్ సిపి నాయకులు, జెడ్పీటీసీ సభ్యులు కూడా బొంజుబాబు, ఆనందరావు, మాజీ జెడ్పీటీటి సూర్యనారాయణ, సూరయ్య పాల్గన్నారు.










