బాపట్ల : ఇంజినీరింగ్ విద్యార్థులు చదువుతోపాటు సమాజ సేవ పట్ల అవగాహన పెంపొందించుకోవాలని బాపట్ల మహిళా ఇంజినీరింగ్ కళాశాల ఇన్‌ఛార్జి ప్రిన్సిపల్ కవిత తెలిపారు. ఈనెల 6న నగరం మండలంలో అగ్ని ప్రమాదానికి గురైన బాధిత కుటుంబానికి బాపట్ల ఇంజనీరింగ్ కళాశాల ఎన్‌సిసి విద్యార్థినులు అందించిన ఆర్థిక సహాయాన్ని గురువారం అందజేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మాట్లాడుతూ నగరం మండలం కమ్మవారిపాలెం గ్రామానికి చెందిన అప్పికట్ల రామకోటయ్య నివాస గహం, పశువుల చావిడి అగ్నిప్రమాదంలో దగ్ధమైనట్లు తెలిపారు. సర్వం కోల్పోయిన బాధిత కుటుంబాన్ని ఆదుకొనేందుకు బాపట్ల ఇంజనీరింగ్ కళాశాలఎన్‌సిసి విద్యార్థినులు ముందుకొచ్చి. తమ వంతు సాయంగా రూ.10వేల నగదు, మూడు నెల్లకు సరిపడా నిత్యవసర వస్తువులు అందజేసినట్లు ఆమె తెలిపారు. అఈ కార్యక్రమంలో నగరం విఆర్‌ఒ సుధాకర్, బాపట్ల మహిళా ఇంజినీరింగ్ కళాశాల హాస్టల్ వార్డెన్ ప్రత్తిపాటి ప్రేమ్‌చంద్, ఎన్‌సిసి కెప్టెన్ శ్రీదేవి, ఎన్‌సిసి క్యాడెట్లు చందన, కావ్యశ్రీ ,లక్ష్మీ ప్రసన్న, జీవనజ్యోతి, లక్ష్మీ ,శశికళ, వైష్ణవి పాల్గొన్నారు.










