Jun 01,2023 00:26

బాధితుడిని పరామర్శిస్తున్న మాజీ మంత్రి నక్కా ఆనంద్‌బాబు

భట్టిప్రోలు(అమతలూరు) : గత నెల 28న రాజమహేంద్ర వరంలో టిడిపి ఆధ్వర్యంలో మహానాడు నిర్వహించారు. అదే సమయంలో ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. దీంతో లైటింగ్‌ కోసం ఏర్పాటు చేసిన ఇనుపరాడ్లు విరిగి పడిపోవడంతో అమతలూరు మండలం ఇంటూరు గ్రామానికి చెందిన కర్లపూడి మోషే అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. బాధితుడు గుంటూరు ప్రభుత్వ వైద్యశాలలో చిక్సిత పొందాడు. ప్రస్తుతం ఇట్టి వద్ద విశ్రాంతి తీస ుకుంటున్నాడు. అందులో భాగంగా మాజీమంత్రి నక్కా ఆనందబాబు బుధవారం మోషేను పరామర్శించారు. పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని, అధైర్య పడవద్దని భరోసా ఇచ్చారు. మోషేను పరామర్శించిన వారిలో అమతలూరు మండలం, ఇంటూరు టిడిపి నాయకులు,కార్యకర్తల పాల్గొన్నారు.