నగదు, సరుకులు ఇస్తున్న సర్పంచ్ శ్రీనివాస్
ప్రజాశక్తి-నక్కపల్లి:మండలంలోని రేబాక గ్రామంలో గురువారం అర్ధరాత్రి సమయంలో గ్రామానికి చెందిన కర్రీ నాగేశ్వరరావుకు చెందిన పూరిల్లు దగ్ధమైంది. నగదు, సామాగ్రి, విలువైన పత్రాలు, బట్టలు పూర్తిగా కాలి బూడిదయ్యాయి. గ్రామ సర్పంచ్ సాది రెడ్డి శ్రీనివాసరావు వెంటనే స్పందించి బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి రూ.10 వేల నగదు, నిత్యావసర సరుకులను అందజేశారు. అండగా ఉంటానని హామీ ఇచ్చారు. మాజీ ఎమ్మెల్యే చెంగల వెంకట్రావు కూడా గ్రామానికి వెళ్లి బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి రైస్, నిత్యావసర సరుకులు అందజేశారు.తహసీల్దార్ నీరజ శుక్రవారం గ్రామానికి వెళ్లి కాలి బూడిదైన ఇల్లును పరిశీలించారు. తమను అన్ని విధాలా ఆదుకోవాలని బాధితులు తహసీల్దార్ ను కోరారు.










