Jun 07,2023 19:35

బాధితులతో మాట్లాడుతున్న గుమ్మనూరు నారాయణ

ప్రజాశక్తి - చిప్పగిరి
బాధిత రైతుకు పరిహారమందేలా కృషి చేస్తామని ఆలూరు మార్కెట్‌ యార్డు ఛైర్మన్‌ గుమ్మనూరు నారాయణ తెలిపారు. బుధవారం దౌల్తాపురం గ్రామంలో వాలంటీరు వివాహ వేడుకకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎద్దులు మృతి చెందిన విషయం తెలుసుకొని బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడారు. మంగళవారం దౌల్తాపురం గ్రామంలో పాముకాటుతో రెండు ఎద్దులు మృతి చెందాయని తెలిపారు. బాధితులకు ప్రభుత్వం నుంచి అందే సహాయం వర్తించేలా పశు వైద్య అధికారులతో మాట్లాడతామని చెప్పారు. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరామ్‌కు విషయం తెలిపి ఆర్థిక సహాయం అందేలా కృషి చేస్తామన్నారు. రైతుకు ఎద్దులు ఎంత ముఖ్యమో తెలుసన్నారు. ఎద్దులు పోగొట్టుకున్న ఆ రైతుకు ఎంత బాధ ఉంటుందో అర్థం అవుతుందని తెలిపారు. అసెంబ్లీ బూత్‌ కన్వీనర్‌ రాజన్న, వైసిపి నాయకులు శ్రీధర్‌, రాజన్న, సతీష్‌, శంకర్‌, చంద్రయ్య, సుధాకర్‌ పాల్గొన్నారు.