Oct 30,2023 22:39

చెక్కును అందజేస్తున్న ఎమ్మెల్యే


ప్రజాశక్తి-మార్కాపురం
మార్కాపురం పట్టణంలోని కరెంట్‌ ఆఫీస్‌ వెనుక ప్రాంతంలో నివసిస్తున్న పోసాని సుధీర్‌ అనే బాలుడు సమీపంలోని మాగుంట సుబ్బరామిరెడ్డి మున్సిపల్‌ పార్కులో ఆడుకునే సమయంలో ట్రాన్స్‌ఫార్మర్‌ వద్ద విద్యుత్‌ ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో సుధీర్‌ తీవ్రంగా గాయపడ్డాడు. ఎమ్మెల్యే నాగార్జునరెడ్డి ఆ బాలుడి వైద్యం కోసం కృషి చేశారు. బాధిత కుటుంబానికి విద్యుత్‌ శాఖ తరపున రూ.5లక్షల పరిహారం వచ్చేలా చూశారు. మంజూరు చేసిన రూ.5లక్షల చెక్కును సుధీర్‌ తల్లిదండ్రులకు ఎమ్మెల్యే నాగార్జునరెడ్డి సోమవారం అందించారు. ఈ కార్యక్రమంలో విద్యుత్‌ శాఖ ఇఇ పివి నాగేశ్వరరావు, డిఇఇ సియానాయక్‌, మున్సిపల్‌ చైర్మన్‌ చిర్లంచెర్ల బాలమురళీక్రిష్ణ, వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ గొలమారి శ్రీనివాసరెడ్డి, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ షేక్‌ ఇస్మాయిల్‌, వైసిపి నాయకులు మల్లాపురం ఉత్తంకుమార్‌, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.