బాధిత కుటుంబానికి వైఎస్‌ఆర్ బీమా పంపిణీ
బాధిత కుటుంబానికి వైఎస్‌ఆర్ బీమా పంపిణీ
ప్రజాశక్తి -చౌడేపల్లి: బాధిత కుటుంబానికి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వైయస్సార్ బీమా ను అందించారు. మండలంలోని పంచాయతీ కేంద్రం దుర్గ సముద్రంకు చెందిన సద్దాం (25) కట్టెల కని వెళ్లి మూర్చ వ్యాధి మూలంగా నడిం బావిలో పడి మతి చెందాడు. పోషకుడు మతి చెందడంతో అతని కుటుంబం వీధిన పడింది దీంతో స్థానిక వైసిపి నాయకులు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దష్టికి తీసుకెళ్లారు. స్పందించిన ఆయన తిరుపతిలోని తన నివాసంలో వైఎస్‌ఆర్ బీమా ద్వారా బాధితురాలు చిన్నక్కకు రూ 5 లక్షల చెక్కు అందించారు. జడ్పిటిసి నడింపల్లి దామోదర్ రాజు, సర్పంచ్ సరస్వతి, హరినాథ్ వైసిపి నాయకులు జంగారెడ్డి, కష్ణమరాజు, ప్రభాకర్ రెడ్డి, అమర్నాథ్ పాల్గొన్నారు.










