Oct 22,2023 18:46

ప్రజాశక్తి - పాలకొల్లు
              నిస్సహాయులకు ప్రభుత్వంతో పాటు సమాజం కూడా చేయూతనివ్వాలని వాకర్స్‌ క్లబ్‌ పాలకొల్లు అధ్యక్షుడు తటవర్తి సుధాకర్‌ అన్నారు. పెనుగొండ బస్టాండ్‌ దగ్గరలో నివాసం ఉంటున్న కండెల్లి సత్తెమ్మ సోదరుడు అనారోగ్యంతో మంచం పట్టాడు. ఆమె కుమార్తెలు శస్త్రచికిత్స చేయించుకున్నారు. భర్తలేని తన కుటుంబ జీవనం కష్టంగా ఉందని, మందులతో పాటు నిత్యావసర వస్తువులను అందించి ఆదుకోవాలని సత్తెమ్మ కోరింది. దీంతో స్పందించిన సుధాకర్‌ పాలకొల్లు డీలక్స్‌ రోడ్డులో ప్రియాంక టవర్స్‌ వద్ద ఆమెకు రూ.ఏడు వేల విలువైన నిత్యావసర వస్తువులు, మందులు అందించారు. ఈ కార్యక్రమంలో క్లబ్‌ కార్యదర్శి షేక్‌ పీర్‌ సాహెబ్‌, కోశాధికారి పోతుల ఉమాశంకర్‌, డైరెక్టర్‌ జవ్వాజి కల్యాణ్‌ పాల్గొన్నారు.