Nov 04,2023 17:14

చెక్కును అందజేస్తున్న ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి

ప్రజాశక్తి - మంత్రాలయం
ఇటీవల విజయనగరం జిల్లాలో జరిగిన రైలు ప్రమాదంలో మృతి చెందిన యువకుడు చాకలి తాయప్ప కుటుంబానికి కేంద్ర ప్రభుత్వం సెంట్రల్‌ రైల్వే శాఖ నుంచి రూ.10 లక్షలు మంజూరు చేసింది. కోసిగి మండలం అగసనూర్‌ గ్రామానికి చెందిన చాకలి తాయప్ప రైలు ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే. శనివారం ఎమ్మెల్యే స్వగ్రామమైన రాంపురంలో మృతుని కుటుంబానికి ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి రూ.10 లక్షల చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. జరిగిన ఘోరాన్ని తలచుకొని బాధ పడవద్దని హితవు పలికారు. అధైర్య పడవద్దని, అండగా ఉంటామని హామీ ఇచ్చారు.