లాజర్ కుటుంబాన్ని పరమర్శిస్తున్న ఆనందబాబు
ప్రజాశక్తి-భట్టిప్రోలు ్ భట్టిప్రోలు మండలం పెదపులివర్రు పంచాయతీ పరిధిలోని అక్కివరిపాలెం గ్రామానికి చెందిన సిపిఎం నాయకులు గొర్రుముచు లాజర్ గుండెపోటుతో మృతి చెందిన విషయం తెలిసిందే. బాధిత కుటుంబాన్ని మాజీమంత్రి నక్కా ఆనందబాబు సోమవారం పరామర్శించి సంతాపం, సానుభూతిని వ్యక్తం చేశారు. లాజర్ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర కార్యదర్శి తునుగుంట్ల సాయిబాబా, పట్టణ అధ్యక్షుడు కుక్కల వెంకటేశ్వరరావు, టిడిపి నాయకులు, సిపిఎం నాయకులు టి. కష్ణమోహన్,ముత్యాలరావు తదితరులు పాల్గొన్నారు.










