Mar 30,2023 00:19

సంఘీభావం తెలిపారు.

ప్రజాశక్తి-మాడుగుల:కాకినాడ జిల్లా తొండంగిలో హత్యకు గురైన నదిపల్లి రాజు కుటుంబానికి రాష్ట్ర మాల మహానాడు నేతలు మంగళవారం సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని, వ్యవసాయ భూమి కేటాయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సియాద్రి శ్రీనివాసరావు, జిల్లా అధ్యక్షులు కొత్తపల్లి శ్రీను, కార్యదర్శి పాము దాసు, జిల్లా విజిలెన్స్‌ అండ్‌ మొనటరింగ్‌ కమిటీ సభ్యులు, మాడుగుల కు చెందిన మరువాడ ఈశ్వరరావు, రాష్ట్ర రెల్లి హక్కుల పోరాట సమితి అధ్యక్షులు ఎర్రం శెట్టి పాపారావు, తదితరులు పాల్గొన్నారు.