Nov 11,2023 22:34

ప్రజాశక్తి - రాజమహేంద్రవరం రూరల్‌ ధవళేశ్వరంలోని గొల్లపేటకు చెందిన ఆకుల.సూర్యకుమారి గుండెపోటుతో మృతి చెందిందని, ఆమె కుటుంబానికి న్యాయం చేయాలని జనసేన పార్టీ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్‌ డిమాండ్‌ చేశారు. మృతిరాలకి వాలంటీర్‌ నల్ల విజయ బీమా సౌకర్యాన్ని కల్పించడంలో నిర్లక్ష్యం వహించడం వల్లే నేడు ఆమెకు బీమా లభించలేదని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమాచారాన్ని తెలుసుకున్న కందుల దుర్గేష్‌ కుటుంబ సభ్యులను పరామర్శించారు. వలంటీర్‌ నిర్లక్ష్యం వల్ల జరిగిన తప్పిదం వల్ల నేడు ఆ కుటుంబం రోడ్డున పడిందని, దీనికి అధికారులే బాధ్యత వహించి ఆమె కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు.