Oct 20,2023 20:48

నిత్యావసర సరుకులు అందజేస్తున్న విలేకరులు

ప్రజాశక్తి - దేవనకొండ
నేపాల్‌ నుంచి వచ్చి దేవనకొండలో నివాసం ఉంటూ గత వారం రోజుల క్రితం మృతి చెందిన గూర్ఖా భార్య కుటుంబానికి మండల విలేకరులు శుక్రవారం ఆర్థిక సహాయం అందజేశారు. గత కొన్నేళ్లుగా గ్రామంలో కుటుంబ సభ్యులతో కలిసి ఉంటున్న గూర్ఖా భార్య గత వారం రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందారు. వీరికి ఐదుగురు కుమార్తెలు, నలుగురు కుమారులు ఉన్నారు. ఇంటి యజమాని గ్రామంలో రాత్రి గూర్ఖాగా విధులు నిర్వహిస్తున్నారు. భార్య, పిల్లలు స్థానిక హోటళ్లు, నివాస గృహాల్లో ఇంటి పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. తల్లి అనారోగ్యంతో మృతి చెందడంతో దిక్కుతోచని స్థితిలో పడ్డారు. ప్రస్తుతం దినకర్మ చేసుకునేందుకు ఇబ్బందిగా ఉందన్న విషయం తెలుసుకున్న విలేకరులు స్పందించి వారికి రెండు నెలలు కావాల్సిన నిత్యావసర సరుకులతో పాటు దినకర్మ ఖర్చులకు గాను రూ.5 వేలు అందజేశారు. ఎపియుడబ్ల్యుజె మండల అధ్యక్షులు పురుషోత్తమ గౌడ్‌, కార్యదర్శి వన్నూరప్ప, చిన్న, తిరుపతయ్య, గులాం బాష పాల్గొన్నారు.