Jul 24,2023 21:26

ప్రజాశక్తి - కాళ్ల
              మండలంలోని దొడ్డనపూడి గ్రామంలో ఇటీవల మృతి చెందిన పోనమడి సాయిబాబు కుటుంబానికి ఆర్థిక సాయం అందించేందుకు ముందుకు వచ్చిన సర్పంచి కొల్లి సుబ్బారావును పలువురు గ్రామ పెద్దలు అభినందించారు. భాస్విని ట్రస్టు ద్వారా పోనమడి సాయిబాబు కుటుంబానికి రూ.10వేల ఆర్థిక సహాయాన్ని సోమవారం అందించారు. దొడ్డనపూడి గ్రామంలో ప్రభుత్వం నుంచి పింఛను పొందేందుకు అర్హత ఉన్నప్పటికీ కొందరు పింఛన్‌ పొందలేక పోతున్నారు. పేద ప్రజల ఆర్థిక పరిస్థితిని గమనించిన గ్రామ సర్పంచి కొల్లి సుబ్బారావు సేవాదృక్పాథంతో గత రెండు సంవత్సరాల నుంచి ట్రస్టు ద్వారా పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వీరామంగా కొనసాగిస్తున్నారు. గ్రామంలో ప్రతి నెలా భాస్విని ఛారిటబుల్‌ ట్రస్ట్‌ ద్వారా 35 మంది పేదలకు పింఛన్లు పంపిణీ చేస్తున్నారు. ఒక్కో లబ్ధిదారునికి రూ.వెయ్యి చొప్పున అందిస్తున్నారు.