Apr 09,2023 00:09

ఆర్థిక సాయం అందజేస్తున్న కేసన శంకరరావు

ప్రజాశక్తి-భట్టిప్రోలు : మండల పరిధిలోని వెల్లటూరు గ్రామానికి చెందిన పెదలంక లక్ష్మీ మాధవి అనే మహిళ ఇటీవల మృతిచెందింది. పేద కుటుంబానికి చెందిన లక్ష్మీ మాధవి మతి గురించి సమాచారం తెలుసుకున్న బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేసన శంకరరావు మృతురాలి కుటుంబ సభ్యులను శనివారం పరిమర్శించారు. తన వంతు సాయంగా ఆర్థిక సహాయం అంద జేశారు. ఈ కార్యక్రమంలో బిసి సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రవికుమార్‌, నియోజకవర్గ నాయకులు పోతార్లంక రాజేష్‌, ఎంపిటిసి వాకా వెంకట నారాయణ తదితరులు పాల్గొన్నారు.