ప్రజాశక్తి-నర్సీపట్నంరూరల్:మండలంలోని చెట్టుపల్లి గ్రామంలోని మెట్టకాలనీలో ఇటీవల అగ్ని ప్రమాదంలో పూరిల్లు దగ్ధమై సర్వం కోల్పోయిన యర్రంశెట్టి కొండబాబు కుటుంబానికి గ్రామ భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో రూ.20వేలను ఆదివారం అందజేశారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షులు పసుపులేటి అప్పలనాయుడు, కార్యదర్శి గోవింద్ మాట్లాడుతూ, నిరుపేద కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని కోరారు. బాధిత కుటుంబాలను ఆదుకోవడంపై రాష్ట్ర రెల్లి హక్కుల రిజర్వేషన్ పోరాట సమితి అధ్యక్షులు యర్రంశెట్టి పాపారావు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు మోపాడు చిన్నబ్బాయి, పసుపులేటి రాజు, బంటు సోమరాజు, మహాలక్ష్మి, రాజు, గంగిరెడ్ల అప్పలనాయుడు, లంక సత్తిబాబు, పండూరి బాబురావు, ఎర్ర ఈశ్వరరావు, పిల్లా శ్రీను, గళ్ళ సూరిబాబు, కర్ణం రాంబాబు, వెంకటరావు, వరహాలరావు తదితరులు పాల్గొన్నారు.










