ప్రజాశక్తి - ఆగిరిపల్లి
ఇటీవల రో డ్డు ప్రమాదంలో మృతి చెందిన గ్రంధి సుబ్రహ్మణ్యం కుటుం బానికి మండల ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో రూ.1.2 లక్షలు ఆర్థిక సాయం అందించారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య ప్రముఖులు తవ్వా మురళీ మాట్లాడుతూ బాధిత కుటుంబానికి ఒక సంవత్సరం పాటు నెలకు ఒక బియ్యంకట్ట అందిస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘ అధ్యక్షులు యండూరు నరసింహ, మడుపల్లి గోపాలకృష్ణ, యండూరు ప్రణీత్, శ్రీనివాసరావు, శ్రీనివాసరావు, ముక్తేశ్వరరావు, కిరణ్ పాల్గొన్నారు.










