బీమా నగదును అందజేస్తున్న ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి
ప్రజాశక్తి - మంత్రాలయం
బాధిత కుటుంబాలకు వైఎస్‌ఆర్ బీమా ఆసరాగా ఉంటుందని ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి తెలిపారు. మంగళవారం మండలంలోని రాంపురం గ్రామానికి చెందిన షేక్ గౌస్ మోదీన్ గతనెల 28న అనారోగ్యంతో బాధపడుతూ కర్ణాటక రాష్ట్రం రాయచూరులో చికిత్స పొందుతూ మృతి చెందారు. తక్షణ సహాయం కింద అదే రోజు అంత్యక్రియల కోసం రూ.10 వేల నగదును అందజేశారు. ప్రభుత్వం నుంచి మంజూరైన వైఎస్‌ఆర్ బీమా నగదు రూ.లక్షను నామిని అయిన మృతుని భార్య ఖాజా భానుకు మంగళవారం ఎమ్మెల్యే స్వగ్రామమైన రాంపురంలో ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... బాధిత కుటుంబం ధైర్యంగా ఉండాలని, అండగా ఉంటామని హామీ ఇచ్చారు.










