Mar 15,2023 23:47

బాధిత కుటుంబాన్ని పరామర్శిస్తున్న నాయకులు

ప్రజాశక్తి - నిజాంపట్నం : నిజాంపట్నం గ్రామానికి చెందిన నాయుడు భాస్కరరావు ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడు. ఇదే గ్రామానికి చెందిన చెన్ను నాగేశ్వరరావు, లంకె వెంకటేశ్వర్లు అకాల మృతి చెందారు. బాధిత కుటుంబాలను ఎంపిపి మోపిదేవి హరినాథ్‌ బాబు, జడ్‌పిటిసి నర్రా సుబ్బయ్య, వైస్‌ ఎంపిపి ఉన్నవ చంటి, ఎంపిటిసి నాజర్‌ ఖాన్‌, బోటు యూనియన్‌ ప్రెసిడెంట్‌ కన్నా శ్రీనివాసరావు తదితరులు బుధవారం పర మర్శిం చారు. తమ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని తెలిపారు.ఈ కార్యక్రమంలో హాస్ప టల్‌ చైర్మన్‌ నాయుడు వెంకటేశ్వర రావు, వైసిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.