
ప్రజాశక్తి - రేపల్లె
ఇటీవల వినాయక నిమజ్జనం సందర్భంగా మృతి చెందిన పడమటి విజయ్, కొండేటి వెంకటేశ్వరరావు కుటుంబ సభ్యులను రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణరావు శుక్రవారం పరామర్శించారు. ధైర్యంగా ముందుకు సాగాలని కుటుంభ సభ్యులకు ధైర్యం చెప్పారు. ప్రమాదం జరిగిన తీరును, కుటుంభ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ప్రమాదంలో మరణించిన ఇద్దరు యువకుల కుటుంబాలకు ప్రభుత్వ పరంగా ఆదుకుంటామన్నారు. 25వ వార్డులో ఇటీవల మరణించిన పసుపులేటి దుర్గా ప్రసాద్ కుటుంబాన్ని పరామర్శించారు. ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. మండలంలోని సింగుపాలెం సర్పంచ్ యార్లగడ్డ రమాదేవి భర్త శ్రీనివాసరావు మృతదేహానికి నివాళులర్పించారు. శ్రీనివాసరావు కుటుంబానికి సానుభూతి తెలిపారు. అధైర్యపడొద్దని, అండగా ఉంటామని ఆయా కుటుంబాలకు భరోసా ఇచ్చారు. ఆయన వెంట వైసిపి పట్టణ కన్వీనర్ గడ్డం రాధాకృష్ణమూర్తి, కౌన్సిలర్ బేతపూడి కోటేశ్వరరావు ఉన్నారు.