Mar 27,2023 16:15

బాధిత కుటుంబాలకు చెక్కు అందజేస్తున్న జిల్లా ఎస్పీ, తదితరులు

బాధిత హోంగార్డు కుటుంబాలకు  ఆర్థిక సహాయం
ప్రజాశక్తి - నంద్యాల కలెక్టరేట్

      నంద్యాల జిల్లాలోని డోన్, నంద్యాల యూనిట్ లో పనిచేస్తు విదినిర్వహణలో మరణించిన హోం గార్డ్ లు ఏ.మనోహరరెడ్డి  వి.రమేష్   కుటుంబసభ్యులకు  జిల్లా ఎస్పీ కె. రఘు వీర్ రెడ్డి ఆర్థిక సహాయం కింద చెక్కు ను అందజేశారు. బాధిత కుటుంబాలు ఆర్ధికంగా ఇబ్బందులు పడకుండా వారికి  ఆర్ధిక సహాయంగా ప్రభుత్వం  నుండి ఫ్లాగ్ ఫండ్  కింద ఇద్దరి కుటుంబాలకు రూ.10,000/-ల చెక్కును  (పది వేల రూపాయలను)  ప్రదీప్  కుటుంబానికి రూ.15,000/- రూపాయల చెక్కును  జిల్లా ఎస్పీ  కుటుంబసభ్యులకు సోమవారం నంద్యాల జిల్లా పోలీసు కార్యలయం లో అందజేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా  అడిషనల్ ఎస్పీ ఆర్.రమణ , ఆర్మూడ్ రిజర్వ్ ఇన్స్పెక్టర్ సుధాకర్  తదితరులు పాల్గొన్నారు.