Sep 03,2023 20:10

సమావేశంలో మాట్లాడుతోన్న మాజీ మంత్రి పి. నారాయణ

ప్రజాశక్తి - నెల్లూరు ప్రతినిధి :చంద్రబాబునాయుడుతోనే భవిష్యత్తుకు గ్యారంటీ ఉంటుందని మాజీ మంత్రి నారాయణ అన్నారు. ఆదివారం స్థానిక గోమతి నగర్‌లో ఆయన క్యాంప్‌ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. నగరంలోని 3వ డివిజన్‌ నుంచి 16వ డివిజన్‌ వరకు బూత్‌ ఇన్‌ఛార్జులు, క్లస్టర్‌ ఇన్‌ఛార్జులు, కార్యకర్తలు హాజరయ్యారు. కార్యక్రమంలో భాగంగా భవిష్యత్తుకు గ్యారంటీ ప్రోగ్రాంపై ప్రొజెక్టర్‌ ద్వారా కార్యకర్తలకు అవగాహన కల్పించారు. బూత్‌ లెవెల్‌ కార్యకర్తలు కీలకంగా వ్యవహరించి ఓటర్లను ప్రభావితం చేయాలని ప్రతినిధులు సూచించారు. ప్రజలకు భవిష్యత్తుపై నమ్మకం కలిగించాలని చెప్పారు. వైసిపి వైఫల్యాలను ఎండగడుతూ టిడిపి ీ లక్ష్యాలను ప్రతి గడపకు చేరవేయాలని చెప్పారు. ప్రతి చోట ప్రజావేదికలు ఏర్పాటు చేసి భవిష్యత్తు కి గ్యారంటీ లక్ష్యాలను వివరించాలన్నారు. మొత్తం 45 రోజుల పాటు కార్యాచరణ రూపొందించుకుని పనిచేయాలని సూచించారు. అనంతరం డివిజన్ల వారీగా సేకరించిన డేటాను పరిశీలించిన నారాయణ పలు సూచనలు చేశారు. నెల్లూరు పార్లమెంట్‌ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అబ్దుల్‌ అజీజ్‌ మాట్లాడుతూ సంక్షేమం,అభివద్ధి అజెండాగా ముందుకెళుతున్నామని చెప్పారు. చంద్రబాబుకు ,నారాయణకు ప్రతిరూపంగా ప్రతి కార్యకర్త ప్రజల్లోకి వెళ్ళాలని చెప్పారు. మాజీ మంత్రి నారాయణ మాట్లాడుతూ... ప్రతి ఇంటికెళ్లి వివరాలను సేకరించడం ద్వారా ప్రజలకు ఏమి కావాలో తెలుసుకోవచ్చన్నారు. తల్లికి వందనం, ఆడబిడ్డ నిధి, అన్నదాతలకు అందే సాయం,నిరుద్యోగ యువతకు అందించే భతి వంటి పధకాలను కార్యకర్తలకు వివరించారు. బూత్‌ లెవల్లో ఎక్కడా నిర్లక్ష్యం కనిపించారాదని సూచించారు.ప్రభుత్వం ఆదాయం సష్టించే విధానాలపై దష్టి పెట్టలేదన్నారు. అందుకే రాష్ట్రం అప్పుల్లోకి వెళ్లిపోతోందని వ్యాఖ్యానించారు. సర్వేలు టిడిపి అనుకూలంగా ఉన్నాయన్నారు.