Aug 27,2023 21:06

కొండాడలో ప్రచారం చేస్తున్న టిడిపి నాయకులు భూదేవి

ప్రజాశక్తి - సీతంపేట : టిడిపి అధినేత చంద్రబాబుతోనే రాష్ట్ర ప్రజలకు భవిష్యత్తుకు గ్యారెంటీ ఉంటుందని పాలకొండ నియోజకవర్గ టిడిపి నాయకులు పడాల భూదేవి అన్నారు. ఆదివారం కొండాడ పంచాయతీలో భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమం చేపట్టారు. టిడిపి మ్యానిఫెస్టోపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఒక్క అవకాశమని వైసిపికి అధికారం కట్టబెట్టిన పాపానికి రాష్ట్రం అస్థవ్యస్థంగా మార్చారని విమర్శించారు. మద్య నిషేధం పేరుతో మహిళలను దగాచేశారని ఆరోపించారు. ముఖ్యంగా గిరిజనులకు తీరని అన్యాయం జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. భవిష్యత్తు బాగుండాలంటే బాబు రావాల్సిందేనన్నారు. మినీ మ్యానిఫెస్టోలో ప్రకటించిన సంక్షేమ పథకాల గురించి వివరించారు. మహాలక్ష్మి లాంటి మహాశక్తి పథకం మహిళలకు వరం లాంటిదన్నారు. టిడిపి పాలనలో యువతకు ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నారు. కావున రానున్న ఎన్నికల్లో సైకోను ఇంటికి పంపించాల్సిన బాధ్యత ప్రజలంతా తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో మాజీ ఎంపిపి సవర కుంపి, మాజీ ఎంపిటిసి బి.జయలక్ష్మి, సవర చిన్నారావు, తదితరులు పాల్గొన్నారు.