'బాబుతో నేనుంటా'...!
రెండో రోజూ రిలేదీక్ష
దీక్షాశిబిరాల్లో జనసేన సైతం
ప్రజాశక్తి - యంత్రాంగం
'చంద్రబాబుతో నేనుంటా' అంటూ టిడిపి శ్రేణులు రెండో రోజూ రిలే దీక్షలు కొనసాగించాయి. గురువారం జనసేన నాయకులు సైతం దీక్షా శిబిరాల వద్దకు విచ్చేసి మద్దతు ప్రకటించారు. టిడిపి, జనసేన కలిసి పోటీ చేస్తాయని అధినేత పవన్‌కల్యాణ్‌ప్రకటించిన నేపథ్యంలో జనసేన కార్యకర్తలు దీక్షా శిబిరాల వద్దకు చేరుకుని ఆనందం వ్యక్తంచేశారు. వెంకటగిరి, తలకోనల్లో చంద్రబాబుకు అంతా మంచే జరగాలంటే పూజలు నిర్వహించారు. తిరుపతి కార్పొరేషన్ కార్యాలయం వద్ద రిలేదీక్ష కొనసాగింది.
వెంకటగిరిలో... త్రిభువని సెంటర్లో రిలేనిరాహారదీక్ష చేపట్టారు. తెలుగు యువత ఉపాధ్యక్షులు కెవికె ప్రసాద్, సత్యనారాయణ, బీరం రాజేశ్వరరావు, పప్పు చంద్రమోహన్‌రెడ్డి, తోట కృష్ణయ్య, చాముండి రాధమ్మ పాల్గొన్నారు.పాలకేంద్రం సెంటర్లో ఉన్న టిడిపి కార్యాలయంలో డాక్టర్ మస్తాన్‌యాదవ్ ఛారిటబుల్ ట్రసుట ఆధ్వర్యంలో చండీయాగం నిర్వహించారు. వెదురుకుప్పంలో.. గంగాధర్ నెల్లూరు దీక్షా శిబిరంలో వెదురుకుప్పం మండల మాజీ అధ్యక్షులు మోహన్ మురళి, గుండయ్య, బిఎం రవి పాల్గొన్నారు. నల్లకండువాలతో నిరసన తెలిపారు. పుత్తూరు టౌన్‌లో.. టిడిపితో కలిసి నడవాలని పవన్‌కల్యాణ్ నిర్ణయించడంతో టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి గాలి గోపీనాధ్ హర్షం ప్రకటించారు. రేణిగుంటలో.. పాత చెక్‌పోస్టు వద్ద బొజ్జల సుధీర్‌రెడ్డి, బొజ్జల రిషితరెడ్డి, మాజీ ఎంఎల్‌ఎ ఎస్సీవి నాయుడు దీక్షలో పాల్గొన్నారు. టిడిపి అద్యక్షులు నరసింహయాదవ్, కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి విచ్చేశారు. గూడూరులో.. పెళ్లకూరు శ్రీనివాసులురెడ్డి ముఖ్య అతిథిగారెండో రోజు దీక్షల్లో పాల్గొన్నారు. పాశిం సునీల్‌కుమార్ మాట్లాడుతూ ఓటమి భయంతో జగన్ ప్రభుత్వం కుట్రలు చేస్తోందన్నారు. స్కిల్ డెవలప్‌మెంట్ ద్వారా లబ్దిపొందిన అనేకమంది తమ నాయకునికి అండగా ఉన్నారన్నారు. సిపిఐ సభ్యులు కాలేష మద్దతు తెలిపారు.
తిరుపతిలో రెండో రోజు










