ప్రజాశక్తి - పర్చూరు
టిడిపి అధినేత చంద్రబాబు అక్రమ అరెస్ట్‌ను నిరసిస్తూ టిడిపి బాపట్ల పార్లమెంటు అధ్యక్షులు, ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు పిలుపు మేరకు "బాబుతో నేను" నినాదంతో పర్చూరు, యద్దనపూడి టిడిపి కార్యాలయాల్లో రిలే నిరాహార దీక్షలు నిర్వహించారు. తొలుత ఎన్‌టిఆర్ విగ్రహాలకు పూలమాలవేసి నివాళులర్పించారు. పర్చూరులో రిలే దీక్షలను టిడిపి అధ్యక్షులు షేక్ షంషుద్దీన్, యద్దనపూడిలో టిడిపి అధ్యక్షుడు నల్లపునేని రంగయ్య చౌదరి ప్రారంభించారు. కార్యకర్తలు నల్ల బ్యాడ్జీలు ధరించి, నల్ల కండువాలు మెడలో వేసుకుని దీక్షలో కూర్చుని నిరసన వ్యక్తం చేశారు.










