
బాబుకు తాత్కాలిక బెయిల్ మంజూరుతో టిడిపి నాయకుల సంబరాలు
ప్రజాశక్తి - పగిడ్యాల
టిడిపి జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మంగళవారం రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి తాత్కాలిక బెయిల్‌పై విడుదల కావడంతో టిడిపి నాయకులు సంబరాలు చేసుకున్నారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో అక్రమంగా అరెస్టు అయిన దాదాపు రెండు నెలలు జైల్లో ఉన్న మాజీ ముఖ్యమంత్రి టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు బెల్పై విడుదలయ్యారు. నందికొట్కూర్ టిడిపి మాజీ ఇంచార్జి బండి జయరాజ్ ఆధ్వర్యంలో టిడిపి నాయకులు కార్యకర్తలు మిఠాయిలు పంచుకొని ఒకరినొకరు తినిపించుకొని సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా బండి జయరాజ్ మాట్లాడారు. చంద్రబాబు నాయుడు పై ఎన్ని అక్రమ కేసులు పెట్టి అన్యాయంగా జైల్లో పెట్టిన ఎప్పటికైనా న్యాయం గెలుస్తుంది అన్నారు. రాష్ట్రంలో టిడిపికి ప్రజా ఆదరణ పెరగడంతో రాబోయే ఎన్నికల్లో ఎక్కడ ఓటమిపాలవుతామునని భయంతో వైసిపి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు పై అక్రమ కేసులు బనాయించి జైల్లో పెట్టించారన్నారు. రాష్ట్ర ప్రజలు టిడిపి వైపే ఉన్నారని వైసీపీ ప్రభుత్వం ఎన్ని అక్రమ కేసులు బనాయించిన అసత్య ప్రచారం చేసిన వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో టిడిపి విజయం సాధించడం నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావడం తద్యమని ఆయన జోష్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు బాలిరెడ్డి, రంగస్వామి, నరసింహులు, మధు శేఖర్, బాలరాజు, రంజిత్ టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.