Apr 21,2023 19:27

మాట్లాడుతున్న జడ్‌పిటిసి విరుపాక్షి

ప్రజాశక్తి - చిప్పగిరి
రాష్ట్రంలో 40 ఏళ్ల ఇండిస్టీ అని చెప్పుకునే చంద్రబాబుకు ప్రజలంతా 2024లో రాజకీయ సమాధి కట్టే సమయం ఆసన్నమైందని ఉమ్మడి జిల్లాల పంచాయతీరాజ్‌ వింగ్‌ అధ్యక్షులు, జడ్‌పిటిసి విరుపాక్షి తెలిపారు. శుక్రవారం చిప్పగిరి జడ్‌పిటిసి స్వగృహంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి జగన్మోహన్‌ రెడ్డి పాలన ఎలా ఉందో, చంద్రబాబు పాలన ఎలా ఉందో ప్రజలంతా ఒక సారి నెమరు వేసుకుంటారని తెలిపారు. పేదలకు ఎవరు సహాయం చేశారనేది ప్రజలందరికీ తెలుసన్నారు. వాస్తవాలతో చెప్పిన మాటలకు, విలువతో ముందుకెళ్లే మనిషి జగనన్న అని తెలిపారు. మోసకారి మాటలు, కుళ్లు, కుతంత్రాలు, ఒక మనిషిని ఎలా దెబ్బతీయాలో ఇవన్నీ తెలిసిన నాయకులు చంద్రబాబు అని విమర్శించారు. కొడుకును పట్టాలను ఎక్కించడానికి ఎంతదాకైనా, ఎవరినైనా వంచించడానికి చంద్రబాబు సిద్ధంగా ఉన్నారన్నారు. తన సొంత మీడియా సంస్థలను తనకు కావాల్సిన రీతిలో వాడుకొని ప్రభుత్వంపై అడుగు అడుగునా విషం చల్లుతున్నారన్నారు. ఈయనకు వంతపడడానికి ఒక పార్టీ పెట్టిన వ్యక్తి తాను ముఖ్యమంత్రి కావడం మానేసి తాను చెప్పినట్లుగానే తల ఊపించి మాట్లాడడం, ఓట్లను చీల్చకుండా చేసి జగనన్నను ఓడిస్తానని పదే పదే చెప్పే ఆ పెద్ద మనిషికి విలువలు ఎంతవరకు ఉన్నాయో ప్రజలందరికీ తెలుసన్నారు. మాజీ కో కన్వీనర్‌, వాల్మీకి మండల అధ్యక్షులు లోకనాథ్‌, మాజీ ఎంపిటిసి మల్లికార్జున, శ్రీరాములు, పుల్లన్న పాల్గొన్నారు.