ప్రజాశక్తి-కందుకూరు :చంద్రబాబునాయుడు నిర్దోషిగా జైలు నుంచి విడుదల అయ్యేవరకు, మహాత్మా గాంధీ చూపిన బాటలో శాంతియుతంగానే నిరసనలు కొనసాగిస్తామని కందుకూరు నియోజకవర్గ టిడిపి ఇన్‌ఛారిజ ఇంటూరి నాగేశ్వరరావు తెలిపారు. చంద్రబాబు అరెస్టుకు నిరసనగా, నారా భువనేశ్వరి చేపట్టిన సత్యమేవ జయతే దీక్షకు సంఘీభావంగా, కందుకూరులోని పార్టీ కార్యాలయం వద్ద సోమవారం రిలే నిరాహార దీక్షలు నిర్వహించారు. గాంధీ జయంతిని పురస్కరించుకుని ముందుగా ఆయన చిత్రపటానికి నాగేశ్వరరావు పూలమాలవేసి నివాళులర్పించారు. నియోజవర్గంలోని వివిధ గ్రామాల నుంచి అధిక సంఖ్యలో మహిళలు, పార్టీ నాయకులు కార్యకర్తలు దీక్షలకు తరలివచ్చారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు దీక్షలు కొనసాగాయి. దీక్ష ముగింపు సందర్భంగా నాగేశ్వరరావు మాట్లాడుతూ గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని చంద్రబాబు నాయుడు కొనసాగిస్తే, నిధులన్నీ దారి మళ్ళించి పంచాయతీ వ్యవస్థను జగన్మోహన్ రెడ్డి సర్వనాశనం చేశాడని విమర్శించారు. పట్టణ పార్టీ అధ్యక్షులు దామా మల్లేశ్వరరావు, గుడ్లూరు మండల పార్టీ అధ్యక్షులు జనిగర్ల నాగరాజు, పార్టీ సీనియర్ నాయకులు ఘట్టమనేని చెంచురామయ్య, కండ్రా మాల్యాద్రి, చెరువుపల్లి మాల్యాద్రి, పలువురు మహిళా నేతలు దీక్షా శిబిరంలో మాట్లాడారు. పట్టణ పార్టీ అధ్యక్షుడు దామా మల్లేశ్వరరావు, వలేటివారిపాలెం మండలం పార్టీ అధ్యక్షుడు మాదాల లక్ష్మీనరసింహం, గుడ్లూరు మండల పార్టీ అధ్యక్షులు నాగరాజు, పట్టణ ప్రధాన కార్యదర్శి ముచ్చు శ్రీను, నాయకులు కండ్రా మాల్యాద్రి, ఘట్టమనేని చెంచురామయ్య, చెరువుపల్లి మాల్యాద్రి, నాదెళ్ల వెంకట సుబ్బారావు, గోచిపాతల మోషే, చిలకపాటి మధు, కల్లూరి వెంకటేశ్వర్లు, వడ్డెళ్ళ రవిచంద్ర, ముచ్చు వేణు, పులి నాగరాజు ఉన్నారు.










