Oct 01,2023 16:45

భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న బండి జయరాజ్

బాబు వస్తానే మనందరికీ భవిష్యత్తు

నందికొట్కూరు నియోజవర్గం నాయకులు బండి జయరాజ్
ప్రజాశక్తి - పగిడ్యాల

   టిడిపి అధికారంలోకొస్తే నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినప్పుడే మనందరికీ  , ఆంధ్రప్రదేశ్ కు భవిష్యత్తు ఉంటుందని  లేదంటే భవిష్యత్తు లేకుండా పోతుందని  నందికొట్కూరు నియోజవర్గం నాయకులు బండి జయరాజ్ అన్నారు. ఆదివారం మండలంలోని నెహ్రు నగర్ గ్రామంలో బాబు షూరిటీ  భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బండి జయరాజ్ మాట్లాడారు.  టిడిపి నంద్యాల పార్లమెంట్ ఇన్చార్జి మాండ్ర శివానందరెడ్డి, టిడిపి నంద్యాల జిల్లా మాజీ అధ్యక్షులు గౌరు వెంకట్ రెడ్డి ఆదేశాల మేరకు నెహ్రూ నగర్ గ్రామంలో బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు. నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితేనే ఆంధ్రప్రదేశ్ కు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు భవిష్యత్తు ఉంటుందని అన్నారు. గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాండ్ర శివానందరెడ్డి నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి పనులు చేశారని గుర్తు చేశారు. ముచ్చుమారి ఎత్తిపోతల పథకం నిర్మాణం పూర్తి చేసి రైతులకు సాగునీరు అందించిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. ప్రస్తుత వైసీపీ ప్రభుత్వంలో నిత్యవసర వస్తు ధరలు పెంపు , ఎరువుల ధరలు పెంచడం వల్ల రైతులు,  ప్రజలు  నానా అవస్థలు పడుతున్నారన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు, రైతలు పండించిన పంటలకు మద్దతు ధర కల్పించాలన్న, నిరుపేదలకు పూర్తిస్థాయిలో సంక్షేమ పథకాలు అందాలన్నా , నిరుపేద కుటుంబ విద్యార్థులు ఉన్నత చదువులు చదవాలన్న చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితేనే ఇది సాధ్యమన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు భవిష్యత్తు బంగారంలా సాగుతుందన్నారు. తెలుగుదేశం పార్టీకి ప్రజా ఆదరణ పెరిగి   వచ్చే ఎన్నికల్లో టిడిపి అధికారులకు వస్తుందని భయంతోనే చంద్రబాబు నాయుడు పై అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేయించారని మండిపడ్డారు. అదేవిధంగా పగిడ్యాల గ్రామంలో  94వ పోలింగ్ బూతు ఇంచార్జి పగడం శేఖర్ ఆధ్వర్యంలో భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమం నిర్వహించారు, వారు ఇంటింటి తిరిగి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు నరసింహారెడ్డి, లక్ష్మన్న టిడిపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.