ప్రజాశక్తి - యంత్రాంగం
బెయిల్‌పై చంద్రబాబు విడుదలవ్వడంతో టిడిపి శ్రేణులు సంబరాలు నిర్వహించాయి. బాణసంచా కాలుస్తూ, స్వీట్లు పంచుతూ టిడిపి నాయకులు, కార్యకర్తలు సంబరాల్లో పాల్గొన్నారు. కాకినాడ కలెక్టరేట్ ప్రాంగణంలో టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షులు జ్యోతుల నెహ్రూ ఆధ్వర్యంలో స్వీట్లు పంచారు. ఆయన వెంట జ్యోతుల నవీన్ తదితరులున్నారు. కాకినాడ సిటీ మాజీ ఎంఎలశ్రీ వనమాడి కొండబాబు ఆధ్వర్యంలో ఇంద్రపాలెం జంక్షన్‌లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బాణ సంచా కాల్చి స్వీట్లు పంచారు. నగర అధ్యక్షులు మల్లిపూడి వీరు, రూరల్ నాయకులు పేరాబత్తుల రాజశేఖర్, నులుకుర్తి వెంకటేశ్వరరావు, చప్పిడి వెంకటేశ్వరరావు, ఎమ్‌డి ఆన్సర్, పాల్గొన్నారు. కాకినాడ రూరల్‌లో మాజీ ఎంఎల్‌ఎ పిల్లి అనంతలక్ష్మి ఆధ్వర్యంలో టిడిపి శ్రేణులు బాణసంచా కాల్చి, పసుపు బెలూన్లను ఎగురవేసి స్వీట్లు పంచారు. టిడిపి రాష్ట్ర కార్యదర్శి పిల్లి సత్యనారాయణమూర్తి, జడ్‌పిటిసి మాజీ సభ్యులు బుంగా సింహాద్రి, పట్టా ప్రకాష్ గౌడ్ సంపర మాజీ చైర్మన్ కర్రి వెంకట్రాజు తదితరులు పాల్గొన్నారు. సామర్లకోట మఠం సెంటర్‌లో టిడిపి సామర్లకోట పట్టణ అధ్యక్ష,కార్యదర్శి కుమార స్వామి, బడుగు శ్రీకాంత్ ఆధ్వర్యంలో బాణ సంచా కాల్చారు. ఎంఎల్‌ఎ చినరాజప్ప కార్యాలయం వద్ద టిడిపి నాయకులు సంబరాలు నిర్వహించారు.కంటే జగదీష్ మోహన్, బలుసు వాసు, గొర్రెల జయలక్ష్మి, నిమ్మకాయల కిరణ్, బొందల రామలక్ష్మి, పడాల వీరబాబు పాల్గొన్నారు. తాళ్లరేవు టిడిపి కార్యాలయం వద్ద టిడిపి ముమ్మిడివరం నియోజకవర్గం ఇన్‌ఛార్జి దాట్ల సుబ్బరాజు ఆధ్వర్యంలో బాణ సంచా కాల్చారు. మాజీ ఎంఎల్‌ఎ చెల్లి వివేకానంద, రాష్ట్ర కార్యదర్శి గుత్తుల సాయి, తెలుగు యువత రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి ధూళిపూడి బాబి, మందాల గంగ సూర్యనారాయణ, నడింపల్లి వినోద్ పాల్గొన్నారు. రౌతులపూడిలో టిడిపి నాయకులు స్వీట్లు పంచారు ఈ కార్యక్రమంలో టిడిపి మండల అధ్యక్షులు సత్యనారాయణ, మాజీ ఎంపీపీ భాస్కర్ బాబు తదితరులు పాల్గొన్నారు. పెద్దాపురం పట్టణంలో టిడిపి కార్యనిర్వాహక కార్యదర్శి రాజా సూరిబాబు రాజు ఆధ్వర్యంలో బాణ సంచా కాల్చారు. కట్టమూరులో మేడిది శ్రీనివాస్ ఆధ్వర్యంలో బాణసంచాలు, డప్పుల వాయిద్యాలతో సంబారాలు నిర్వహించి సీట్లు పంచారు. ఈ కార్యక్రమంలో టిడిపి పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు రంది సత్యనారాయణ, తూతిక రాజు, టిడిపి మండల అధ్యక్షులు కొత్తిం వెంకట శ్రీనివాసరావు, ఎలిశెట్టి నాని, నూనె రామారావు పాల్గొన్నారు.










