Nov 06,2023 00:01

ప్రజాశక్తి-గండేపల్లి, శంఖవరం గండేపల్లి మండలం ఎన్‌టి.రాజాపురంలో ఆదివారం టిడిపి మండల అధ్యక్షుడు పోతుల మోహనరావు, రాష్ట్ర కార్యదర్శి ఎస్‌విఎస్‌.అప్పలరాజు ఆధ్వర్యంలో ప్రతి ఇంటికీ వెళ్లి బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గారంటీ పథకాలను వివరించారు. కానుకొనల శ్రీను.కంటిపూడి సత్యనారాయణ, బొల్లంరెడ్డి రామకృష్ణ, కొనుజుల సత్తిబాబు, మద్దిపాటి వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. శంఖవరం మండలం కత్తిపూడిలో టిడిపి ప్రత్తిపాడు ఇన్చార్జ్‌ వరుపుల సత్యప్రభ కరపత్రాలు పంపిణి చేసి ప్రచారం చేశారు. పార్టీ నాయకులు వెన్న శివ, పర్వత సురేష్‌ కీర్తి, సుభాష్‌, జనార్దన్‌, గాబు కృష్ణ, యాళ్ల జగదీష్‌, సాధన లక్ష్మి బాబు, పిర్ల అప్పారావు తదితరులు పాల్గొన్నారు.