Sep 06,2023 20:51

ట్రైసైకిల్‌ అందజేస్తున్న ఎంఎల్‌ఎ

ట్రైసైకిల్‌ అందజేస్తున్న ఎంఎల్‌ఎ
'బాబు ష్యూరిటీ-భవష్యత్తుకు గ్యారెంటీ'
ప్రజాశక్తి-నెల్లూరు:రూరల్‌ నియోజకవర్గ పరిధిలోని 26వ డివిజన్‌, జ్యోతి నగర్‌ లో బాబు ష్యూరిటీ - భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమం నిర్వహించారు. బుధవారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి, టిడిపి నాయకులు కోటంరెడ్డి గిరిధర్‌ రెడ్డి , రాష్ట్ర కార్యదర్శి జెన్ని రమణయ్యలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రూరల్‌ ఎంఎల్‌ఎ కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో టిడిపి ప్రభుత్వం అదికారంలోకి వచ్చిన వెంటనే 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు ఆడబిడ్డ నిధి పథకంలో ప్రతి నెల రూ.1500లు అందజేస్తారన్నారు. అదే విధంగా తల్లికి వందనం పేరుతో ప్రతి ఇంటిలో చదువుకొనే ప్రతి బిడ్డకు ఏడాదికి రూ. 15 వేలు ఆ బిడ్డ తల్లికి ప్రభుత్వం అందజేస్తుందన్నారు
. దీపం పేరుతో ప్రతి ఇంటికి ఏడాదిలో 3 గ్యాస్‌ సిలిండర్‌ను ఉచితంగా అందజేస్తామన్నారు. రాష్ట్రంలో టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రతి మహిలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో 26వ డివిజన్‌ కార్పొరేటర్‌ బూడిద సుప్రజ, టీడీపీ నాయకులు బూడిద పురుషోత్తం యాదవ్‌, తెలుగు దేశం పార్టీ డివిజన్‌ ఇంచార్జ్‌ గలాజు శివాచారి, ప్రొగ్రాం కోఆర్డినేటర్‌ జలదంకి సుధాకర్‌, క్లస్టర్‌ ఇంఛార్జ్‌ అల్లాభక్షు, షణ్ముఖ పూర్ణిమ, ఎల్‌.పి. కష్ణా రెడ్డి, నరసింహయ్య ముదిరాజ్‌, బ్రహ్మదేవి సుబ్బయ్య, కొమ్మి శంకరయ్య, ఎస్‌. మాధవి, వల్లెపు దయాకర్‌, రాజేష్‌, జావీద్‌, హరీష్‌ రెడ్డి, కార్తీక్‌, ఇలియాజ్‌, రఫీ, శంకర్‌, జహీర్‌, ఇర్ఫాన్‌, మునాఫ్‌, రేణు, ఉప్పల శ్రీనివాసులు, తాటిపర్తి శ్రీనివాసులు, జుబేర్‌, నస్రు, సర్ధార్‌, ప్రసాద్‌, ఎజాస్‌, వినోద్‌, హేమంత్‌, ఇమ్రాన్‌, శాంతి, విజయ, తిరుపతి, చంద్ర, చిట్టిబాబు, సుబ్బరాజు తదితరులు పాల్గొన్నారు.